Home  »  Bollywood News  »  Ajay Devgn: అజయ్ దేవ్‌గన్ కొత్త మూవీ చౌహన్.. పఠాన్ లతో చెప్పండి

Updated : Jun 25, 2026

 

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్( Ajay Devgn)చిరకాలం నుంచే తెలుగు ప్రేక్షకులకి సుపరిచయస్తుడు. ఆర్ ఆర్ ఆర్ తో అయితే తెలుగు వారి అభిమాన నటుడుగా మారాడు. యాక్షన్ హీరో అనే టాగ్ లైన్ తో దూసుకుపోతున్న అజయ్ దేవ్ గన్   ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ తో తన కొత్త మూవీ చేస్తున్నాడు. 

ఇప్పుడు ఆ  చిత్రానికి 'చౌహాన్' (Chauhaan) అనే టైటిల్‌ని  అధికారికంగా ప్రకటించారు. జియో స్టూడియోస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఉంది. దిగ్గజ స్టంట్ కొరియోగ్రాఫర్, అజయ్ దేవ్‌గన్ తండ్రి దివంగత వీరూ దేవ్‌గన్ జయంతి సందర్భంగా ఈ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేస్తూ మేకర్స్ ఆయనకి  ఘన నివాళులు అర్పించారు. . అజయ్ దేవ్‌గన్ రగ్గడ్, ఇంటెన్స్ లుక్, బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే వార్ ఎలిమెంట్స్  అంచనాలని ఒక్కసారిగా స్కై హైకి తీసుకెళ్లాయి. కథాంశం విషయానికి వస్తే  2018 పుల్వామా ఉద్రిక్తతల నేపథ్యంలో, దేశ రక్షణ కోసం పోరాడే పవర్‌ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గా అజయ్ దేవ్‌గన్ కనిపించనున్నాడు 
.
 వీడియో టీజర్‌లో దేశ భద్రతకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన గణాంకాలని  ప్రస్తావించారు. దేశంలో దాదాపు 15 లక్షల మంది సైనికులు ఉన్నప్పటికీ, రక్షణ రంగం కోసం సుమారు 35,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నప్పటికీ, సరిహద్దుల్లో ఉగ్రవాదులని , తిరుగుబాటుదారులని  అణచివేయడం ఎంత కష్టమైన సవాలుగా మారిందో వాయిస్ ఓవర్ ద్వారా వివరించారు. కన్నీటి వాయువు (Tear Gas), వాటర్ కెనాన్లు, పెల్లెట్ గన్స్ వంటి సాధారణ శాంతిభద్రతల చర్యలు విఫలమైన చోట 'చౌహాన్' ఎలా రంగంలోకి దిగాడనేది కథాంశంగా చూపించబోతున్నారు.


Also read: vishnu vishal: ఫేస్ మారిపోయే వ్యాధితో బాధపడుతున్న హీరో విష్ణు విశాల్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్


వీడియో చివర్లో అజయ్ దేవ్‌గన్ తన ట్రేడ్‌మార్క్ గంభీరమైన గొంతుతో చెప్పిన డైలాగ్ థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఐకానిక్ సాంగ్ 'జుమ్మా చుమ్మా దే దే' మ్యూజిక్ వినిపిస్తుండగా, "పఠాణ్‌లతో చెప్పండి.. చౌహాన్ వస్తున్నాడు. అజయ్ దేవ్‌గన్ చెప్పిన పవర్ ప్యాక్డ్ పంచ్‌లైన్ సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. నీరజ్ యాదవ్ కథని అందిస్తూ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జ్యోతి దేశ్‌పాండే, ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ కలిసి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మొహమ్మద్ జీషాన్ అయ్యూబ్ కీ రోల్ లో చేస్తున్నాడు.అజయ్ దేవ్‌గన్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ డ్రామాగా నిలిచిపోతుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. 2027 అక్టోబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.